ఆర్టీసీకి ప్రస్తుత కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఏమీ చేయడం లేదనే విమర్శలను కొట్టిపారేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. కీలక గణాంకాలను వెలువరించింది. గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీకి ఏమేం చేశారు.. అదే ప్రస్తుత ప్రభుత్వం గత రెండున్నరేళ్లలోనే ఆర్టీసీకి ఏం చేసింది అనేదానిపై లెక్కలతో సహా వివరించారు. ఈ ప్రభుత్వ హాయంలోనే ఆర్టీసీలో అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగాల పెరుగుదల, సేవల విస్తరణ ఉన్నాయని ఆ లెక్కలు వెల్లడిస్తున్నాయి.