హైదరాబాద్‌లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. శనివారం ఆయన జయంతిని పురస్కరించుకుని సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన.. దేశానికి, అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అందించిన సహాకారం, సేవలను ఆయన కొనియాడారు.