ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా ఈవూరు మండలంలోని ఓ గ్రామంలో రేబిస్ లక్షణాలతో రెండేళ్ల పసి పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బొగ్గరం గ్రామానికి చెందిన రెండేళ్ల సోహాన్ రుద్రాన్ష్ కింద పడిపోవడంతో మొహం మీద గాయమైంది. అయితే ఆ గాయంపై ఓ కుక్క వచ్చి నాకింది. దీనిని గమనించని తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత బాలుడు ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. అప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. బాలుడు మృతి చెందాడు.