ఓ ఆర్మీ మేజర్ భార్యను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను ఏఐ సాయంతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. సోషల్ మీడియాలో వాటిని అప్‌లోడ్ చేయడంతో పాటు బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితురాలి భర్త హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాడు. ఘనటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.