ఐపీఎల్ కప్‌ను తొలిసారి ఆర్సీబీ ముద్దాడటంతో.. దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాలు కొన్ని చోట్ల విషాదాన్ని నింపాయి. ఆర్సీబీ కప్ గెలవగానే మంగళవారం అర్ధరాత్రి.. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి ర్యాలీలు, నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఆర్సీబీ గెలుపు సంబరాలు.. విజయవాడలో విషాదానికి కారణం అయ్యాయి. బైక్ ర్యాలీ తీస్తుండగా.. పడిపోయిన ఓ యువకుడు ప్రాణాలు విడిచాడు.