స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళను రూ. 2.58 కోట్లు మోసం చేసిన అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మయన్మార్ కేంద్రంగా సాగుతున్న ఈ స్కామ్‌లో మ్యూల్ ఖాతాలు సరఫరా చేసిన బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురిని పట్టుకున్నారు.