విదేశాల్లోని ఉన్న కొడుకు, కోడలు, మనవళ్లతో గడపడానికి వెళ్లిన భార్యాభర్తలు.. చివరకు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. రోడ్డు ప్రమాదంలో అత్తాకోడళ్లు ప్రాణాలు కోల్పోయారు. తన కళ్లెదుటే భార్య, కోడలు చనిపోవడంతో భర్త దిగ్భ్రాంతికి గురయ్యారు. విశాఖకు చెందిన జీడీ ప్రసాద్.. ఆస్ట్రేలియాలోని ఉండే తన కుమారుడి వద్దకు భార్యతో కలిసి వెళ్లారు. వారు ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదానికి గురయ్యారు.