"ఇంకా ఎంతకు దిగజారుతారు.. సిగ్గులేదా? మీరింక మారరు": ప్రకాష్ రాజ్

2 hours ago 1
ప్రశ్న రావణ్‌ను ఏపీ పోలీసులు మరో కేసులో అదుపులోకి తీసుకున్నారనే వార్తలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఎలమంచిలి కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత వేంపాడు వద్ద తనను మరోసారి అదుపులోకి తీసుకున్నారంటూ ప్రశ్న రావణ్ వీడియో విడుదల చేశారు. పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించినందుకు ఇదంతా చేస్తున్నారని.. పోలీస్ స్టేషన్‌లోనే చంపేయాలంటూ వీడియోలో పేర్కొన్నారు. లేకపోతే తానే ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోతానంటూ తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో విడుదల చేశారు.ఈ పరిణామాలపై స్పందించిన ప్రకాష్ రాజ్.. ఏపీ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు.
Read Entire Article