తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం 'దోస్త్' (DOST) ప్రక్రియ ఈ నెల 15న ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి నేడు దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. ఈసారి ప్రభుత్వం విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ సీట్లను 11 వేలకు పెంచుతోంది. దీని ద్వారా విద్యార్థులు చదువుకుంటూనే ఇంటర్న్‌షిప్ చేసి ప్రతి నెలా స్టైపెండ్ పొందే గొప్ప అవకాశం లభిస్తుంది. కనీసం 8 వేల సీట్లు భర్తీ చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించింది.