టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానిక వాహనదారులకు NHAI కొత్త సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది. వైట్ నంబర్ ప్లేట్ వాహనాలకు నెలకు రూ.360 చెల్లించి ఇంటి నుంచే నెలవారీ టోల్ పాస్ పొందవచ్చు. రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో ఆధార్, నివాస, వాహనం, ఫాస్టాగ్ వివరాలు నమోదు చేయాలి. GIS ఆధారంగా అర్హతను పరిశీలించిన తర్వాత పాస్‌ను ఫాస్టాగ్‌కు లింక్ చేస్తారు. ఆమోదం అనంతరం పాస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పాస్‌తో సంబంధిత టోల్ ప్లాజాపై ఆ నెలలో అపరిమితంగా ప్రయాణించవచ్చు.