ఇంటి లోన్ తీర్చేందుకు భారీ చోరీ.. పని చేసిన ఇంట్లో రూ.1.95 కోట్లు కొట్టేసిన కార్పెంటర్

1 hour ago 2
అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టాడో ప్రబుద్ధుడు. ఇంటి లోన్ తీర్చేందుకు ఓ వ్యక్తి తాను పని చేసిన ఇంట్లోనే భారీ చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ వెస్ట్‌ మారేడుపల్లిలో చోటు చేసుకుంది. యజమానులు లేని సమయంలో నకిలీ తాళం చెవితో ఇంట్లోకి ప్రవేశించి రూ.1.80 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదును అపహరించాడు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో అంబర్‌పేటలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు.
Read Entire Article