ఇంటూరి రవి కిరణ్‌ను పీటీ వారెంట్‌తో రాష్ట్రం మొత్తం తిప్పతున్నారు: భార్య సుజన ఆవేదన

2 months ago 4
కూటమి ప్రభుత్వం తన భర్త ఇంటూరి రవికిరణ్‌పై అక్రమ కేసులు పెట్టిస్తోందని ఆయన భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తపై తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారో తెలియదని.. కేసుల గురించి అడిగితే పోలీసులు సమాధానం చెప్పడం లేదన్నారు. ఇంటూరి రవి కిరణ్ ఆరోగ్యం బాగోలేదని.. ఆయన హార్ట్ పేషెంట్ అన్నారు. రోజు 8 గంటలు రెస్ట్ తీసుకోవాలని.. రోజూ ఐదు నుంచి ఆరు వందల కిలోమీటర్ల తిప్పుతున్నారన్నారు. ఆయనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పోలీసుల నుంచి రవి కిరణ్‌కు ప్రాణ హాని ఉందని.. పీటీ వారెంట్ మీద రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారన్నారు. పోలీసులు మొత్తం సోషల్ మీడియా కార్యకర్తల కోసం పని చేస్తున్నారని.. రవి కిరణ్‌పై 20 కేసులు పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు. తాను పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన సమయంలో.. దువ్వాడ, రాజమండ్రి సీఐలు దురుసుగా ప్రవర్తించారన్నారు. రవికిరణ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని డాక్టర్లు చెప్పిన కూడా పోలీసులు వినిపించుకోలేదని.. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా టీడీపీ నాయకులతో తప్పుడు ఫిర్యాదులు పంపించి రవికిరణ పై కేసులు పెట్టిస్తోందన్నారు.
Read Entire Article