Srikakulam Wild Animals Case One Arrest: శ్రీకాకుళంలో ఓ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. ఇంట్లో వన్యప్రాణుల్ని పెంచుతూ అడ్డంగా దొరికిపోయాడు. నాగ్‌పూర్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ టీమ్ ఇచ్చిన సమాచారంతో సోదాలు చేసిన అటవీశాఖ అధికారులు.. అతడి ఇంట్లో అడవి కోళ్లు, మలబారు ఉడుతలు, నక్షత్ర తాబేళ్లను సీజ్ చేశారు. యువకుడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. వీటిని ఎక్కడి నుంచో తీసుకొచ్చారో ఆరా తీస్తున్నారు.