విశాఖపట్నంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. విశాఖపట్నం మల్కాపురం ఆదర్శ రాయల్ విద్యాలయ సమీపంలోని ఓ ఇంటిలోకి దొంగ ప్రవేశించాడు. ఇంట్లోకి చొరబడిన దొంగ.. చెక్క బీరువా పగలగొట్టి అందులోని నగలు, నగదు కాజేశాడు. ఇక తిరిగి బయల్దేరి క్రమంలో ఇంటి యజమాని కంట్లో పడ్డాడు. ఇంటి ఓనర్ గట్టిగా కేకలు వేయటంతో ఏం చేయాలో పాలుపోక చోరీ సొత్తు అక్కడే వదిలేసి రేకుల షెడ్‌లోకి దూరి పరారయ్యాడు. ఈ ఘటనలో దొంగ గాయపడినట్లు తెలిసింది.