ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేడు సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి అక్కినేని నాగార్జున, వెంకటేష్, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబులతో పాటు పలువురు దర్శకులు, హీరోలు కూడా హాజయ్యారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధితో పాటు పలు కీలకమైన అంశాలపై చర్చించారు.