‘ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు’.. ఆహా..! కోతి అద్దంలో చూసుకుంటూ ఎలా మురిసిపోతోందో చూడండి..

9 months ago 16
వరంగల్ జిల్లాలోని ముత్తోజిపేటలో ఒక కోతికి అద్దం దొరికింది. అది తన ప్రతిబింబాన్ని చూసి విస్మయానికి గురైంది. అనంతరం తన రూపాన్ని పదేపదే తిలకిస్తూ మురిసిపోయింది. దాదాపు గంటసేపు తన సౌందర్యాన్ని ఆస్వాదించిన వానరం, అద్దాన్ని వదిలి వెళ్లిపోయింది. మనుషులలో కనిపించే స్వీయ ఆరాధన జంతువులలో కూడా ఉంటుందని ఈ వీడియో నిరూపించింది. ఈ ఆశ్చర్యకర సంఘటనను సెల్‌ఫోన్లలో బంధించిన ప్రజలు సోషల్ మీడియాలో విడుదల చేయడంతో.. అది విపరీతంగా వైరల్ అయింది.
Read Entire Article