ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరుగుతోంది. సర్వేయర్లు ఇంటింటికి వెళ్లి పథకం కోసం అప్లయ్ చేసుకున్న వారి వివరాలను ఇందిరమ్మ ఇండ్లు ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. అయితే యాప్‌లో వివరాలు సక్రమంగా చేస్తున్నారా.. లేదా..? అని తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు సూపర్ చెక్ చేయనున్నారు. సర్వే పూర్తయిన 5 శాతం ఇళ్లలో మళ్లీ సర్వే చేయనున్నారు. ఇక సంక్రాంతి తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్కార్ భావిస్తోంది.