ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా ఫైనల్ బిల్లులు అందని లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న తుది బిల్లులను రాబోయే కొద్ది రోజుల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు 8 లక్షల ఇళ్ల కోసం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున రూ.40 వేల కోట్ల వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రెండో విడతకు ఎంపికైన 145 మందికి మంజూరు పత్రాలు అందజేశారు. మండలంలో తొలి విడతలో మంజూరైన 648 ఇళ్లలో 620 పూర్తయ్యాయని చెప్పారు.