ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సందడి.. 2.21 లక్షల కుటుంబాలతో రేవంత్ సర్కార్ పండుగ

1 hour ago 1
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా గృహప్రవేశాలు పూర్తయిన ఇళ్లకు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ అధికారులు వెళ్లి కుటుంబాలతో పండుగ జరుపుకోనున్నారు. తొలి విడతలో మంజూరైన 4.50 లక్షల ఇళ్లలో ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని మంత్రి పొంగులేటి తెలిపారు. మరో 1.90 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. అదేవిధంగా పలు నగరాల్లో జీ+5 విధానంలో ఇందిరమ్మ టవర్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Read Entire Article