Apsrtc Ac Super Luxury E Bus: ఆంధ్రప్రదేశ్‌లో పాత డీజిల్ సూపర్ లగ్జరీ బస్సులను ఎలక్ట్రిక్ ఏసీ బస్సులుగా మార్చేందుకు అధికారులు వినూత్న ప్రయోగం చేపట్టారు. చిత్తూరులో ఈ ప్రక్రియ మొదలైంది. బెంగళూరు, పుణె సంస్థల సహకారంతో బస్సులను మార్చనున్నారు. ఈ మార్పులతో నిర్వహణ ఖర్చులు సగానికి తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. విజయవంతమైతే మరిన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయి. ముందుగా ఒక బస్సుతో ఈ ప్రయోగం చేస్తున్నారు.