HYDRA Demolitions: హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో అక్రమాలే లక్ష్యంగా.. హైడ్రా బుల్డోజర్లు దండెత్తుతుండటం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే.. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ.. ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు.. రాజ్ భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో.. ఇక నుంచి అక్రమ కట్టడాలపైకి హైడ్రా బుల్డోజర్లు టాప్ గేర్‌లో దూసుకుపోనున్నాయి.