ఏపీలో భిన్నమైన వాతావరణం ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు, ఉక్కబోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు మరికొన్ని చోట్ల వర్షం కురవనుంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మేరకు వెల్లడించింది. మంగళవారం రాయలసీమలోని కొన్ని చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు కొన్ని జిల్లాలలో తీవ్రవడగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.