యూట్యూబ్ చూసి ఫేక్ కరెన్సీ తయారీ.. రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు సీజ్.. ఇంటినే అడ్డగా మార్చేసిన ముఠా

1 hour ago 1
యూట్యూబ్ వీడియోల ద్వారా నకిలీ కరెన్సీ తయారీ నేర్చుకున్న ఓ వ్యక్తి.. హైదరాబాద్ శివార్లలో భారీ నకిలీ నోట్ల రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కుంట్లూరులో ఏర్పాటు చేసిన రహస్య తయారీ కేంద్రంపై దాడి చేసి రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో వాహన తనిఖీల సందర్భంగా మొదట రూ.8 లక్షల నకిలీ నోట్లు పట్టుబడటంతో ఈ వ్యవహారం బయటపడింది. నకిలీ పోలీసుల వేషంలో బాధితులను బెదిరించి అసలు డబ్బు దోచుకున్నట్లు కూడా విచారణలో వెల్లడైంది. నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.
Read Entire Article