ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం దుండగులు కోయంబత్తూరు వ్యాపారులపై దాడి చేశారు. వారు రైలు నుంచి దిగి స్టేషన్ బయటకు రాగానే అడ్డుకుని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. ఎవరూ లేని ప్రాంతంలోకి తీసుకెళ్లి.. వారిపై దాడి చేసి భయాందోళనకు గురి చేశారు. వారి దగ్గరున్న రెండు కేజీల బంగారంతో ఉడాయించారు. తర్వాత వ్యాపారులు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులకు రంగంలోకి దిగారు.