సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో బాగా చర్చ జరుగుతున్న అంశం ఇడుపు కాయితం. ఈ సినిమా పేరు బయటకు రాగానే దీనర్థం ఏమిటనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇది కాస్తా ఏపీ, తెలంగాణ నెటిజన్ల మధ్య సోషల్ మీడియా వార్‌కు కారణమైంది. ఈ క్రమంలోనే ఇడుపు కాయితం ట్రోలింగ్ గురించి టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇడుపు కాయితం అర్థం పవన్ కళ్యాణ్‌కు బాగా తెలుసని.. అర్థం తెలియని వాళ్లు ఆయనను అడిగి తెలుసుకోవాలంటూ ఎద్దేవా చేశారు.