ప్రియదర్శి, నాగ దుర్గ నటిస్తున్న ఇడుపు కాయితం సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వివాదం ఇప్పుడు కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇడుపు కాయితం ట్రోల్స్ చేసేవారు.. దానర్థం ఏమిటో పవన్ కళ్యాణ్‌ను అడగాలంటూ టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె వ్యాఖ్యలపై జనసైనికులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే చిప్పకూడు అర్థం ఏమిటో చెప్పాలంటూ కవితను ఉద్దేశించి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ట్వీట్ చేశారు.