జనాభా పెంపుపై సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా పెంచేందుకు ప్రజలకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం ఇద్దరు పిల్లలు ఉండాలనే నిబంధనను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. దీని కోసం చట్టంలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి నుంచే చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో జనాభా తగ్గిపోయే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.