ఇన్‌స్టా ప్రియుడితో రెడ్‌‌హ్యాండెడ్‌గా దొరికిన భార్య.. తుక్కురెగ్గొట్టిన భర్త

1 month ago 5
అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందిన ఇంద్రశేఖర్ (20) అనే యువకుడు.. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో అతడికి ఇన్‌స్టాగ్రాంలో మదనపల్లె మండలం సీటీఎంకి చెందిన ఓ వివాహితతో పరిచయమైంది. ఈ పరిచయం ప్రేమగా మారి.. వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లు గుట్టుగా ఈ వ్యహహారం సాగింది. ఇటీవల మహిళ ప్రవర్తనపై భర్తకు అనుమానం వచ్చి నిఘా పెట్టడంతో మరో వ్యక్తిని ప్రేమిస్తోందని.. అతడి కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పసిగట్టాడు. తన భార్యను దారిలో పెట్టాలని భావించాడు. అదే సమయంలో భార్య లవర్‌కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యాడు. శనివారం రాత్రి తన భార్య బయటకు వెళ్లడం గమనించిన భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదాడు. ఈ దాడిలో గాయపడ్డ ఇంద్రశేఖర్ స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలుస్తోంది.
Read Entire Article