ఓ వ్యక్తి పెళ్లి అయిన తర్వాత.. ఇన్‌స్టాలో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇక ఆ యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించిన ఆ వ్యక్తి.. ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే అటు ఆ యువతితోపాటు.. ఆమె తల్లిని మోసం చేసి.. వారి దగ్గరి నుంచి ఏకంగా రూ.34 లక్షలు తీసుకున్నాడు. అతడికి పెళ్లి జరిగిన విషయం తెలుసుకున్న వారు.. అతడిని నిలదీయగా.. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు ఎక్కింది.