సైబర్ నేరగాళ్లు 'మీ పిల్లలను కిడ్నాప్ చేశాం' అంటూ పోలీసుల పేరుతో తల్లిదండ్రులను భయపెట్టి డబ్బు దోచుకుంటున్నారు. డీప్‌ఫేక్, వాయిస్ మార్ఫింగ్ వంటి టెక్నాలజీలను ఉపయోగించి ఈ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.