ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ క్షమాపణలు తెలిపారు. విజయవాడ దుర్గ గుడిలో తాగునీటి సమస్య గురించి కొంతమంది భక్తులు.. ఎక్స్ ద్వారా నారా లోకేష్ దృష్టికి తెచ్చారు. దుర్గ గుడిలోని ప్రసాదం కౌంటర్ వద్ద తాగునీటి సమస్య గురించి అందులో ప్రస్తావించారు. అలాగే వీడియో జత చేశారు. ఇక దుర్గ గుడికి అశలు ఈవో ఉన్నారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్య గురించి ట్వీట్ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను ట్యాగ్ చేశారు. దీంతో నారా లోకేష్ క్షమాపణలు తెలిపారు.