తెలంగాణలో పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించబడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎమ్మెల్యే కేకే మహేందర్‌రెడ్డి 491 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఇల్లు నిర్మించుకోవడానికి నిధులు లేకపోతే మహిళా సంఘాల ద్వారా రూ. లక్ష లోన్ ఇప్పిస్తామని కలెక్టర్ తెలిపారు. నిర్మాణానికి ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని.. రవాణా చార్జీలు మాత్రమే భరించాలని సూచించారు. పథకం పారదర్శకంగా అమలు చేయబడుతుందని, అవినీతికి పాల్పడితే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ కోరారు.