మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మద్యం విక్రయాలపై సొంత షరతులు విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. నియోజకవర్గంలో సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్మకాలు జరపాలని, పర్మిట్ రూమ్స్ వద్దని ఆయన ప్రకటించారు. దీనిపై వ్యాపారులు ఆందోళన చెందగా.. రాష్ట్రమంతా ఒకే మద్యం విధానం అమలులో ఉంటుందని, అనవసరంగా భయపడొద్దని ప్రభుత్వం హామీ ఇచ్చింది.