ఏపీలోని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు చాలా బాధపడ్డాడనని సినీ నటి మాధవీలత చెప్పుకొచ్చారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై మంగళవారం (జనవరి 21) రోదు ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సినిమా హీరోయిన్లు, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడి.. ఆ తర్వాత సింపుల్‌గా క్షమాపణ చెబితే సరిపోతుందా అని మాధవీలత ప్రశ్నించారు. సీనియర్ రాజకీయ నాయకుడైన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు. జేసీ వ్యవహారంపై తన కుటుంబసభ్యులు సైతం భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.