అక్రమ ఇసుక తవ్వకాల విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది . ఈ దందాపై నిఘా వర్గాలతో రహస్య విచారణ చేపట్టింది. నిఘా అధికారుల ఇచ్చిన నివేదిక ఇసుక మాఫియాతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్న అధికారులపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేస్తున్నారు. తాజాగా, మల్టీజోన్-2 పరిధిలోని 9 జిల్లాల్లో డజనకుపైగా పోలీస్ అధికారులకు ఝలక్ ఇచ్చారు. ఈ మేరకు వారిని వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులను ఐజీ వెలువరించారు.