Tirupati Police Alert On Cyber Phone Calls: ప్రస్తుతం సైబర్ నేరాల తీవ్రత పెరుగుతోంది. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకత్వం, అలక్ష్యాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. ఉద్యోగ ఆఫర్లు, లక్కీ డ్రా, పెట్టుబడి, ఇంటి నుంచే సంపాదన, బహుమతులు గెలిచారని అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.కొన్ని నంబర్లతో రింగ్ చేసి ఎత్తిన తర్వాత హ్యాంగ్ చేస్తారని సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు.