ఏపీలో ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు దాటుతుండటం, ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కొనసాగగడంతో మళ్లీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కూటమి సర్కారు. అందుకు తగిన కసరత్తులు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలాఖారుతో ముగియనున్న విషయం తెలిసిందే. దీంతో పూర్తి బడ్జెట్ రానుంది.