Vijayawada Eagle Challenge Three Arrested: విజయవాడలో గంజాయి గ్యాంగ్ ఆటకట్టించారు పోలీసులు. ఒడిశా నుంచి గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గుర్ని అరెస్టు చేసి వారి నుంచి 1.360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ ఛాలెంజ్‌లో భాగంగా ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రకారం వీరిని అరెస్ట్ చేశారు.. సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ.5వేలు బహుమతిని అందజేశారు. గంజాయి రవాణా, విక్రయించే వారి సమాచారం ఇస్తే రూ.5వేలు ఇస్తారు.. గంజాయి సేవించే వారి సమాచారం ఇస్తే రూ.1500 ఇస్తారు.