ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. లీగల్ టీంకు అనుమతి లేకపోవటంతో ఒంటరిగానే విచారణకు వచ్చారు. ఫార్ములా కేసులో మనీలాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘనపై ప్రధానంగా ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. కాగా, కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. జై రామన్న నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు.