ఉచిత ఇసుకపై కీలక నిర్ణయం.. జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

3 months ago 7
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్ రద్దు చేస్తూ నిర్ణయించింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై నిర్ణయం తీసుకోగా.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో శుక్రవారం భూగర్భ గనుల శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఇకపై ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే ఇసుకను తీసుకెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. మరోవైపు ఇసుక కోసం బుకింగ్ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం పోర్టల్ సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది.
Read Entire Article