Visakhapatnam Kirandul Express Cancelled Duet TO Rains: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. విశాఖపట్నం - కిరండూల్ ఎక్స్ ప్రెస్ రైలును రద్దు చేసింది. బుధవారం, గురువారం ఈ సర్వీసును రద్దు చేశారు. ఈ రూట్‌లో వర్షాల కారణంగా ప్రతికూలత ఉంటుందనే అంచనాతో రైలును రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఈ రైలు గురించి సమాచారం తెలుసుకున్నాకే ప్రయాణాలు ప్లాన్ చేయాలని సూచించారు.