తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆధార్, ఫోన్ నంబర్ వివరాలు IFMIS పోర్టల్‌లో నమోదు చేయని ఉద్యోగులకు ఈ నెల జీతం నిలిపివేస్తామని స్పష్టం చేసింది. అక్టోబర్ 25 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని, లేనిపక్షంలో జీతాలు ఆగిపోతాయని ఆదేశించింది. అక్రమాలను అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.