జనగామ జిల్లా శామీర్‌పేట్ శివారులో ఉపాధి హామీ పనులు చేస్తుండగా మధ్యయుగం నాటి ఒక విగ్రహం బయటపడింది. ఉదయం నుండి పని చేస్తున్న కూలీలకు గడ్డపారకు ఏదో తగలడంతో ఆశగా తవ్వగా.. మెరుస్తూ కనిపించిన పురాతన విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. స్థానిక చరిత్ర పరిశోధకులు ఇది మధ్యయుగం నాటిదని భావిస్తున్నారు. అధికారులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ విగ్రహానికి సంబంధించి చరిత్ర.. వెనుక ఉన్న కథ ఏమిటనే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి.