ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గి ఎండల తీవ్రత పెరిగే అవకాశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లాలోని రామప్ప చెరువును పరిశీలించిన ఆమె.. ప్రస్తుతం అక్కడ 29 అడుగుల మేర నీరు అందుబాటులో ఉందని వెల్లడించారు. డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టు ద్వారా పలు ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద నీటి సంరక్షణ పనులను విస్తృతం చేయాలని, తాగునీటికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.