Vuyyuru Man Suicide: కృష్ణా జిల్లా ఉయ్యూరు లో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలు ఇంట్లో ఉరి వేసుకుని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరు గతంలో ప్రేమించుకోగా.. 2021లో విడిపోయారు. ఈ క్రమంలో యువతి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. ఇద్దరికి పెళ్లి చేయమని అడిగాడు. ప్రియురాలి కుటుంబసభ్యులు నో చెప్పడంతో ఆ యువకుడు ఆ ఇంటి వరండాలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.