ఎంత చెప్పినా, తీరు మార్చుకోని నగర వాసులు.. ఒక్క రోజులో రికార్డ్ డ్రంకన్ డ్రైవ్ కేసులు..

2 months ago 5
కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ముందే హెచ్చరించారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే కొందరు నగరవాసులు తీరు మార్చుకోలేదు. డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవర్ 1 తెల్లవారు జాము వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 1200 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే ముందు చెప్పినా.. లెక్కచేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, పలు ప్రాంతాల్లో మద్యం మత్తులో కొందరు హల్‌చల్ చేయడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.
Read Entire Article