పశ్చిమగోదావరి జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు నిర్మిస్తున్న ఈ రహదారి, ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు విస్తరించి ఉంది. కోర్టు వివాదాలు పరిష్కారమవడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ హైవే పూర్తయితే హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గుతుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేవారికి ఈ హైవే చాలా అనుకూలంగా ఉంటుంది.. విజయవాడ కూడా వెళ్లాల్సిన అవసరం ఉండదు.