తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ టికెట్లు కేటాయించాలని పార్టీ నిర్ణయించింది. గాంధీభవన్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. అదేవిధంగా ఓట్ చోరీ, గద్దీ ఛోడ్ ఉద్యమం చేపట్టాలని.. దాని లోగోను ఆవిష్కరించారు. యూరియా కొరత, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వంటి విషయాలపైనా నేతలు చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు.