హైదరాబాద్ ఈ-ఫార్ములా రేసు కేసులో అరపైసా అవినీతి చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏసీబీ విచారణకు హాజరైన ఆయన.. విచారణకు ముందు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మంత్రిగా తాను హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ప్రయత్నం చేశామే తప్ప కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చేందుకు కాదని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా.. తాము ఎదుర్కొంటామని చెప్పారు.