అనంతపురంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. కూటమి బలపరిచిన మేయర్ అభ్యర్థి అజేశ్ బాబును కోసం సినీ నటుడు సాయి కుమార్ ప్రచారంలో భాగమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనంతపురంతో తనకున్న అనుబంధాన్ని ప్రజలతో పంచుకున్నారు. అజేశ్ బాబును గెలిపించడం ద్వారా నగరం అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రజలకు తెలియజేశారు. అజేశ్ బాబుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.